మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్సే-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్సే
-నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి
-సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు
-బిఆర్ఎస్ తోనే అన్ని రంగాలు అభివృద్ధి
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కరకగూడెం, శోధన న్యూస్ : తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్సే అని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పాపాయి గూడెం, దేవనగరం, గ్రామాలలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మంగళహారతులతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. పోలెబోయిన వారి ఇలవేల్పు ముల్యారుడు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో రైతులకు బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ఎం తో కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పినపాక నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, మరోసారి ఆదరించాలని కోరారు. పినపాక నియోజకవర్గంతో పాటు సంక్షేమంలో సీఎం కేసీఆర్ సహకారంతో అనేక బీటి సీసీ రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. చెక్ డ్యాములు ఇంటింటికి త్రాగునీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఒకటే అన్నారు. మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400 గ్యాస్, ప్రతి కుటుంబానికి 5 లక్షల కేసీఆర్ భీమా , సౌభాగ్య లక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు 3000 జీవన భృతి , తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఆసరా పింఛన్ రూ.5016, దివ్యాంగుల పెన్షన్ రూ.6016కు రైతుబంధు పెట్టుబడి సహాయం 16 వేలకు పెంచి ఇవ్వనున్నట్లు వివరించారు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.