ప్రజా సమస్యలపై పోరాడుతా -వైరా జనసేన అభ్యర్థి సంపత్ నాయక్
ప్రజా సమస్యలపై పోరాడుతా
-వైరా జనసేన అభ్యర్థి సంపత్ నాయక్
ఏన్కూరు, శోధన న్యూస్ : ప్రజా సమస్యలపై పోరాడుతానని బిజెపి బలపరిచిన జనసేన పార్టీ వైరా అభ్యర్థి సంపత్ నాయక్ ఓటర్లను అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మండల కేంద్రమైన ఏనుకూరులో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఈ సం దర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ…అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా మారుతా నని,అవినీతిపై పోరాడుతానని ఒక్కసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను ఆయన కోరారు. నా దగ్గర డబ్బు లేదు చదువుకున్నవాడిని రాష్ట్రంలో ఉ న్న యువత సమస్యలు తెలిసిన వాడిని నా పోరాటంలో మీరంతా భాగస్వాములు కావాలంటే నన్ను ఒకసారి గెలిపించాలని ఆయన కోరారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రజలను డబ్బుతో కొంటున్నారని తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని ప్రశ్నించే గొంతు గా నన్ను ఒకసారి గుర్తించాలని అన్నారు.ఏన్కూరు జనసేన మండ ల కోఆర్డినేటర్ యువకుడు బొగ్గారపు శివకృష్ణను గ్రామాల్లోని ఎన్నికల్లో నిలబడతా నని అన్నారు.మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ పై వేసి అత్యధిక మెజార్టీతో గె లిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల కో ఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ,బిజెపి మండల అధ్యక్షుడు నల్లమోతు రమేష్,పాశం భరత్,బొజ్జగాని సురేష్,భూక్య అనిల్, నాగేశ్వరరావు, అశోక్, పుల్లయ్య,పవన్ తదితరులు పాల్గొన్నారు.