కేప్టెన్ బంజరలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
కేప్టెన్ బంజరలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
కామేపల్లి, శోధన న్యూస్: మండల పరిధిలోని కెప్టెన్ బంజర గ్రామంలో అయ్యప్ప దీక్ష స్వాములు ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా సోమవారం జరిగింది.గ్రామంలోని మాజీ సర్పంచ్ ఆరెం రవి దంపతులు,దీక్ష చేపట్టిన స్వాములు ఘనంగా పడిపూజను హోమగుండం పూజ ను నిర్వహించారు. మండల నలుమూల నుండి అయ్యప్ప స్వాములు పాల్గొని పూజలో ప్రత్యేక భజనలు చేశారు. అనంతరం పడిపూజ చేశారు.స్వాములు హోమగుండంలో ప్రవేశించి భక్తి చాటుకున్నారు. వచ్చిన స్వాములకు అల్పారాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో, గ్రామస్తులు,నిర్వాహకులు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.