ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలి -కారేపల్లి ఎస్సై రామారావు
ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలి
-కారేపల్లి ఎస్సై రామారావు
కారేపల్లి శోధన న్యూ స్: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటును వినియోగించుకోవాలని కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు కోరారు. మంగళవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం 48 గంటలకు ముందు ప్రచారం ముగుస్తుందని,అందులో భాగంగా నేడు 5గంటల తరువాత ఏలాంటి సమావేశాలకు గాని ర్యాలీలకు గాని అనుమతి నిలివేయడం జరిగిందన్నారు.48 గంటల ముందు నుంచి144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. మండల పరిధిలో ఓటర్లును ప్రభావితం చేసే వేరే మండలానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఉండకూడదన్నారు. 30 వ తేదీన ఉదయ 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రానికి100 మీటర్ల దూరంలో ట్రాఫిక్ కి ఇబ్బంది కాకుండా వాహనాలను పార్కింగ్ చేసుకొని, మొబైల్ ఫోన్ ను బయట పెట్టి ఆధార్ కార్డు,లైసెన్స్,ఓటర్ ఐడెంటిటి కార్డ్ ను తీసుకోని క్యూ లైన్లో వెళ్లి ఓటింగ్లో పాల్గొనాలన్నారు. 100 మీటర్ల బయట ఎవరు కూడా టెంట్లు కానీ వాహనాలు కానీ, ఎక్కువమంది ప్రజలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కలిసి ఓటర్లను ప్రభావితం చేయకూడదన్నారు.ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉండకూడదన్నారు. బయట రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో పోలీసులు వచ్చారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరిగే విధంగా అన్ని పార్టీల వారు పోలీస్ వారికీ సహకరించాలన్నారు.