పినపాక నియోజకవర్గ అభ్యర్ధుల ఖర్చుల రిజిస్టర్లను పరిశీలన
పినపాక నియోజకవర్గ అభ్యర్ధుల ఖర్చుల రిజిస్టర్లను పరిశీలన
మణుగూరు, శోధన న్యూస్ : ఈనెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పినపాక నియోజకవర్గం ఎన్నికల భరిలో ఉన్న అభ్యర్థుల ఖర్చుల వివరాల రిజిస్టర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అజయ్ లాల్ చంద్ సోనేజి మంగళవారం పరిశీలించారు. మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో ఆయనఎన్నికల భరిలో ఉన్న ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నామినేషన్ వేసినప్పటినుండి ఇప్పటివరకు ఖర్చు చేసిన వివరాల నమోదు రిజిస్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాఘవరెడ్డి, ఎక్స్పెండిచర్ టీం మహేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.