క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి-పినపాక బీఆర్ఎస్ అభ్యర్ధి రేగా కాంతారావు
క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి
-అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ..
-పినపాక బీఆర్ఎస్ అభ్యర్ధి రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్ : క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, పినపాక బీఆర్ఎస్ అభ్యర్ధి రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గం ఫాస్టర్స్ ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపెట్ట వేస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారిని గౌరవిస్తూ ప్రభుత్వపరంగా పండగల నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.