తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

దమ్మపేట , శోధన న్యూస్: దమ్మపేట మండలం నాయుడుపేట జంక్షన్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం గ్రిల్స్ మరియు టైల్స్ పగలగొట్టినారు ఇలాంటి పనులు సరి కాదు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని టిడిపి నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన దమ్మ పేటలో బుధవారం జరిగిన పాత్రికేయులు సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రజాక్షేత్రంలో గెలవలేని కొంతమంది నేతలు ఏమీ చేయలేక విధ్వంశాలకు పాల్పడుతున్నారని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అశ్వరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కట్రం స్వామి దొర, దమ్మపేట అశ్వరావుపేట మండల అధ్యక్షులు ఎండి వలీ పాషా, నార్లపాటి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు గడ్డిపాటి సత్యం, నాయుడు వీరస్వామి, నాయుడు సుబ్బారావు, బ్రహ్మానందరావు ,ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *