ఎయిడ్స్ నివారణపై అవగాహన
ఎయిడ్స్ నివారణపై అవగాహన
మధిర, శోధన న్యూస్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి నివారణపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ రవికుమార్ వైద్యులు పృధ్వి నాయక్, వీరబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. నివారణ తప్ప చికిత్స లేని ఎయిడ్స్ పట్ల యువత అవగాహన కలిగి ఉండాలన్నారు. కిండ్లీ రూరల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు వి అనూష మాట్లాడుతూ హెచ్ఐవి నివారణ కోసం యువతకు అవగాహన కల్పించేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణ మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.