ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
– ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సిలివేరి ఉమా శంకర్
ఇల్లందు శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ విభాగం ద్వారా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోర్తి జాన్ అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఎయిడ్స్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ సిలివేరి ఉమాశంకర్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ వ్యాధికి మాత్రం ఇంకా మందు రాలేదన్నారు.మందు కోసం దాదాపు 35 ఏళ్లుగా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని అయినప్పటికీ హ్యూమన్ ఇమ్యునో వైరస్ హెచ్ ఐ వి ని చంపలేకపోతున్నారనీ, వైరస్ పెరుగదలను అడ్డుకునేందుకు మాత్రమే మందులున్నాయన్నారు. అందువల్ల ఎయిడ్స్ ఒకసారి వస్తే ఇక అది పూర్తిగా నయం కాదు కానీ దాన్ని మందులతో నియంత్రిస్తూఎక్కువ కాలం జీవించేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు కొండంత మనోధైర్యం కావాలనీ ఎయిడ్స్ పై చర్చించడం కోసం గాను సంవత్సరానికి రెండుసార్లు ఎయిడ్స్ డే నిర్వహించాలని తద్వారా ప్రజల్లో మరింత అవగాహన కలుగుతుందని, ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, కండోమ్ వాడకుండా అపరిచితులతో సెక్స్ చేయడం హెచ్ఐవీకి ప్రధాన కారణం మని కలుషిత రక్తం ఎక్కించడం, సిరంజీలను తిరిగి వాడటం కూడా కారణమే అన్నారు. గర్భధారణ లేదా డెలివరీ సమయంలో, తల్లిపాల ద్వారా కూడా హెచ్ఐవీ సోకే అవకాశం ఉందనీ,ఎయిడ్స్ వచ్చిన వారిని చూసి దూరంగా పారిపోవద్దని,కౌగిలింత, ముద్దులు, షేక్ హ్యాండ్ ఇవ్వడం, తాకడం వల్ల హెచ్ఐవీ వ్యాపించదనీ గాలి, నీరు, దోమకాటు వల్ల హెచ్ఐవీ వచ్చే అవకాశం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ మరో పివో విలియం ప్రసాద్, అధ్యాపకులు జివాజి జగన్, వేణుగోపాల్ వెంకటరమణ రజిని, కావ్య అధ్యాపకేతర సిబ్బంది భూపాల్ సత్యనారాయణ మంజుల సత్యవతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.