బాధ్యత తో పనిచేస్తా – కోరం కనకయ్య
బాధ్యత తో పనిచేస్తా
-కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు, శోధన న్యూస్ : ఇల్లందు లో కాంగ్రెస్ విజయం ప్రజలకు,కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం మని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.ఎమ్మేల్యే గా గెలుపొందిన కోరం కనకయ్య గెలుపొందిన అనంతరం జరిగిన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ ను ఆదరించి తనను గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యత తో పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారి తనంగా ఉంటూ పని చేస్తానని అన్నారు. దాదాపు 25 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తన విజయం కోసం అహోరాత్రులు కష్టపడి పని చేశారని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు. నా విజయంలో మద్దతు తెలిపిన టిడిపి సిపిఐ వైయస్సార్ టిపి, జన సమితి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారం, విద్య వైద్యం ఉపాధి, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. కార్యకర్తల కష్టంతో గెలిచిన నేను వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ పార్టీ మరింత బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.