తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పినపాకలో పాయం  పాగా

పినపాకలో పాయం  పాగా

-స్పష్టమైన ఆధిక్యమిచ్చిన ప్రజలు

-35,129 ఓట్ల మెజార్టీతో గెలుపు

– బిఆర్ఎస్ అభ్యర్థి రేగాకు రెండవ స్థానం

మణుగూరు, శోధన న్యూస్ : ప్రజాకూటమి బలపరిచిన పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు  ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్  అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు నడుమ జరిగిన పోటీలో ప్రతీ రౌండులో పినపాక ప్రజలు పాయం వెంకటేశ్వర్లుకు   స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. తొలి రౌండ్ నుంచే సమీప ప్రత్యర్థి  రేగా కాంతారావు పై వేల సంఖ్యలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు.  ఎన్నికల ఫలితాల్లో తొలిరౌండ్ నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు తనదైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. రౌండ్ రౌండ్ కు పాయం వెంకటేశ్వర్లు కు పెరుగుతున్న మెజార్టీతో ప్రజాకూటమి శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. 18వ రౌండ్లో లెక్కింపు పూర్తికావడంతో  పాయం వెంకటేశ్వర్లు  35,129 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి  రేగా కాంతారావు పై ఘనవిజయం సాధించారు.   పినపాక భరిలో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించగా.. ప్రత్యర్ది  రేగా కాంతారావు 56004  ఓట్లు సాధించి ద్వితీయస్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి పోడియం బాలరాజు 2627, బీఎస్పి అభ్య ర్ది వజ్జా శ్యాములు 714,  అలేం వెంకటేశ్వర్లు 300, కుంజా దుర్గా 79, గుగులొత్ రమేష్ 134, వజ్జా జ్యోతిబసు 144 , స్వతంత్ర అభ్ర్డులు  అలేం నరేంద్ర (కోటి) 134, ఈసం కృష్ణ 703, ఉకే ముద్దరాజు 15 6, కుంజ కృష్ణారావు 130, కోడెమ్ వెంకటేశ్వర్లు 354, జబ్బా కృష్ణ 361,   పాల్వంచ దుర్గ 2167, పూనేం రాజేష్ 1998, బానోత్ జగ్గారావు 1429, వాసం మంగయ్య 1028 ఓట్లు సాదించారు.   ఇక పినపాక నియోజకవర్గంలో నోటాకు 899  ఓట్లు పోలయ్యాయి.   ఈ ఎన్నికల్లో కాంగ్రెస్. టీడీపీ. సీ పీఐ. టీజేఎస్ పార్టీలు జతకట్టి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయి. పాయం కు వచ్చిన మెజార్టీని బట్టి ప్రజాకూటమిలోని టీడీపీ, సీపీఐ. టీజేఎస్ పార్టీలు బిఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు  ఓటమే లక్ష్యంగా పాయం కు ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *