విద్యార్ధుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలి-డిఈఓ వెంకటేశ్వరాచారి
విద్యార్ధుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం డిఈఓ వెంకటేశ్వరాచారి
అశ్వారావుపేట, శోధన న్యూస్ : విద్యార్ధుల సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి డి.వెంకటేశ్వరాచారి అన్నారు.అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట కాంప్లెక్సు,మామిళ్లవారిగూడెం కాంప్లెక్సు సమావేశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంప్లెక్సు సమావేశాలలో ఉపాధ్యాయులు పరస్పరం చర్చించుకోవడం ద్వారా బోధనా మెళుకువలను పెంపొందించుకోవచ్చునని,పాఠశాలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలను పొందవచ్చునని కాంప్లెక్సు సమావేశాలను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సమావేశాలలో చర్చించిన అంశాలను గురించి , పాఠశాలల్లోని విజయ గాధలను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తొలిమెట్టు కార్య్రకమం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు నిరంతర విద్యార్ధిగా ఉండాలని, మారుతున్న పరిస్థితులను అనుగుణంగా బోధన జరపాలని, డిజిటల్ పద్ధతులను అనుసరించాలని అన్నారు. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉన్నతి ,లక్ష్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.టీచర్ల డైరీలను ,పిడియడ్ ప్రణాళికలను పరిశీలించారు. 9,10 తరగతుల విద్యార్ధుల సామర్ధ్యాలను పరిశీలించారు.10వతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. గ్రంధాలయ పిరియడ్ ను వినియోగించుకోవాలని అన్నారు.ఫేషిల్ రికగ్నిషన్ యాప్ పై ఎ.యం.ఒ నాగరాజశేఖర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. బి.సికాలనీ ప్రాధమిక పాఠశాల ప్రత్యేక అవసరాల విద్యార్థినికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, అమృతలూరి నాగరాజశేఖర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి హరిత, మండల నోడల్ అధికారి ఎం ప్రసాధరావు, తొలిమెట్టు ఆర్ పి కట్టా మధు, సి ఆర్పిలు ప్రభాకరాచార్యులు, హనుమంతు, నాగేశ్వరరావు,రామారావు, ఐ ఇఆర్పి రామారావు,మల్లేష్ ,మహబబూబ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.