తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మిచౌoగ్ తుఫాను పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మిచౌoగ్ తుఫాను దృష్ట్యా రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడి
కేంద్రాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మంగళవారం సెలవు ప్రకటించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను హాస్టల్ విడిచి బయటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని తెలిపారు. అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744 241950 సంప్రదించాలిని తెలిపారు. భారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అత్యవసమైతే తప్ప ఇతర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. ఆర్డిఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర సేవలకు మండల, డివిజన్, జిల్లా అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని, అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు.