పాగాల సంపత్ రెడ్డికి ఘన నివాళ్లు
పాగాల సంపత్ రెడ్డికి కేటిఆర్ ఘన నివాళ్లు
జనగామ, శోధన న్యూస్ : జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, బిఅర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి హఠాన్మరణంతో జనగామ జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో పాగాల సంపత్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా ఆఖరి చూపు కోసం నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీమంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు , పసునూరి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మాజీమంత్రి సత్యవతి రాథోడ్ , మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి , బి.ఆర్.ఎస్ ముఖ్యనాయకులు పాగాల సంపత్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం పాగాల సంపత్ రెడ్డి కుటుంబసభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు పాగాల సంపత్ రెడ్డి అకాల మరణం పార్టీకి, తమకు తీరని లోటును మిగిల్చిందన్నారు. పాగాల సంపత్ రెడ్డి కుటుంబానికి పార్టీ, పార్టీ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉంటామన్నారు.