వైరాలో వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
వైరా, శోధన న్యూస్ : నియోజకవర్గ కేంద్రమైన వైరాలోనికోతకొచ్చిన వరి పంటలను మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు ఏడి బాబురావు ఏవో పవన్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగావ్యవసాయ అధికారులు వైరా రిజర్వాయర్ ఆయనకట్టు కింద సాగు చేసుకుంటున్న వరి పంటలను వారు పరిశీలించి. రైతులకు పలు సూచనలు చేశారు.ప్రధానంగా వైరా ప్రాంతంలో 19.0 42ఎకరాల్లో వరి పంట సాగు చేశారని రైతులు ఇప్పటివరకు సుమారుగా 450 నుంచి 986 ఎకరాల్లో కోతలో ప్రారంభించారని వారు తెలియజేశారు.ఎక్కువ శాతం వరి పంట పంట పొలాల్లోనే ఉన్నదని రైతులుఈ పంటలను కాపాడుకునేందుకు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ప్రధానంగా ఈదురు గాలులు రావడం లేదని రైతులు నిర్లక్ష్యంగా ఉండకూడదని వరి పొలాల్లో చుట్టూ ఉన్న నీరును బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రధానంగా వరి పంట ఉన్న పొలాల్లో నీరు ఎక్కువగా ఉన్నట్లయితే పొలాల్లో ఉన్న నీరును బయటకు పంపించేందుకు పాయలుగా చేసి నీరును బయటకు పంపించినట్లయితే పంట నష్టం జరగదని చెప్పారు. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురి అయ్యే అవకాశం ఉందని రైతులు ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కిందకు వెళ్లకుండాతగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా పిడుగుపాటు గురికాకుండా దామిని యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పిడుగుపాటుకు గురై 21 నిమిషాలకు ముందు సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని ఇటువంటి విశాల పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ట్రాన్స్ఫార్మర్లు ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయాలలో రైతులు ఎటువంటి సమయాల్లో విద్యుత్తు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు.తడిసిన దాన్యంలో ఉప్పు వంటి ద్రవం కలిపినట్లయితే పంటకు నష్టం జరగకుండా అవకాశం ఉంటుందని చెప్పారు.రైతులు అవకాశం ఉన్న మేరకు చేతికి వచ్చిన పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.