మిచౌంగ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
మిచౌంగ్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
-మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
అశ్వరావుపేట, శోధన న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులుమెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో వరద ఉధృతంగా ప్రవహించే ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దనీరాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దనీ అన్నారు.వాగులు,రోడ్లుబ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వరుద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దనీ, సెల్ఫీల కోసం పొంగుతున్న వాగు లు,చెరువుల వద్దకు ప్రజలు వెళ్లొద్దని సూచించారు.
పత్తి, వరి రైతులకు ఈ వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వచ్చే రెండు రోజులు వర్షాలు కురుసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.రైతులకు ఏమైనా సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పూడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు చేయాలని సూచించారు.