వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్
దమ్మపేట , శోధన న్యూస్ : గత రెండు, మూడు రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో తీవ్రమైన పంట నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా దమ్మపేట మండలంలో ముంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులను గుర్తించాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దమ్మపేట మండలంలో సుధాపల్లి లో వర్షం కారణంగా దెబ్బతిన్న వేరుశెనగ పంటను , దమ్మపేటలోని పేరంటాళ్ళ చెరువుకు గండి , అలానే చెరువు అలుగు ప్రవహించి పుల్లయ్యశాస్త్రి ఇంటిపక్కనే వున్న గొల్ల వారి ఇండ్లలో నీరు చేరిన దృశ్యాన్ని ,మెయిన్ రోడ్డుపై నీరు పోటెత్తడంతో నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు పరిష్కార చర్యలు చేపట్టాలాని సూచించారు. అనంతరం పలుచోట్ల పంట నష్టపోయిన రైతులను కలెక్టర్ పరామర్శించి ఎవరు అధైర్య పడవద్దని నష్టపరిహారం అతి త్వరలో అందజేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముజాహిద్, వ్యవసాయ శాఖ ఏడి అఫ్జల్ బేగం, పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.