నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి -మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
-మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
ఇల్లందు, శోధన న్యూస్ : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కోరారు.గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కారణంగా రైతులు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.నష్టపరిహారం చెల్లించాలని,యాసంగీ పంటకు కావలసినవిత్తనాలు,ఎరువులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలనికోరారు.స్వామినాథన్ కమిషన్ సూచించిన మేరకు ఎకరాకు ఎంత నష్ట పరిహారం ఇవ్వాలో అంత చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో బొర్రా వెంకన్న,శ్రీరామ్ కొటన్న బోసు,ముత్తక్క పాల్గొన్నారు.