క్యాన్సర్ బాధితురాలికి టాలెంట్ స్కూల్ ఆర్థిక సహాయం
క్యాన్సర్ బాధితురాలికి టాలెంట్ స్కూల్ ఆర్థిక సహాయం
సత్తుపల్లి , శోధన న్యూస్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టాలెంట్ స్కూల్ ఉపాద్యాయురాలు విజయలక్ష్మికి టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు , విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. 76,500 నగదును విజయలక్ష్మి కి వైద్య ఖర్చుల నిమిత్తం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయలక్ష్మి పిల్లలు చదువు పూర్తయ్యే వరకు చదివిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టాలెంట్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.