తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాదే
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాదే
- మణుగూరు కాంగ్రెస్ నాయకులు
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవిని సైతం తునప్రాయంగా రెండుసార్లు త్యాగం చేసిన గొప్ప మహనీయురాలని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుందన్నారు. అందరి సమిష్టి కృషి తో కాంగ్రెస్ పార్టీ గెలుపును సోనియమ్మ కు అందించామన్నారు. .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, నియోజకవర్గ నాయాకులు కాటిబోయిన నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సామా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.