జర్నలిస్టుల పై దురుసుగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఇఇ పై చర్యలు తీసుకోవాలి
జర్నలిస్టుల పై దురుసుగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఇఇ పై చర్యలు తీసుకోవాలి
ఏపి-మన్యం జిల్లా , శోధన న్యూస్ : అక్రమ బదిలీలపై వివరణ కోరిన జర్నలిస్టుల పై దురుసుగా ప్రవర్తించిన పార్వతీపురం విద్యుత్ శాఖ ఇఇ వివి కిషోర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ యూనియన్ జర్నలిస్టు (ఏపియుడబ్ల్యూజె-ఐజెయు) అనుబంధం, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పాత్రికేయులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్వతీపురం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద శాఖ పరమైన బదిలీలలో తనకు అన్యాయం చేశారని, యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది ఆందోళన చేయడం జరిగింది. ఈ విషయం పై విద్యుత్ శాఖ ఇఇ వివి కిషోర్ ను వివరణ కోరగా పత్రిక విలేకర్ల పై దురుసుగా ప్రవర్తించి, బయటకు పోవాలని నెట్టి వేసి గట్టిగా కేకలు వేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసీన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పార్వతీపురం విద్యుత్ శాఖ ఇఇ పై వెంటనే చర్యలు చేపట్టాలని సంబందిత ఉన్నతాధికారులను కోరారు.