అశ్వాపురం లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు…
అశ్వాపురం లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు…
అశ్వాపురం, శోధన న్యూస్ : భద్రాద్రి అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీటీసీ కమటం నరేష్ అధ్యక్షతన సోనియాగాంధీ గారి 78 వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమటం నరేష్ మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగఫలితం ఆత్మబలిదానాలు-అలుపెరుగని పోరాటాలు సకలజనుల సర్వపోరాట ప్రతిమకు దక్కిన ప్రతిఫలమే తెలంగాణా రాష్ట్రం అలాంటి త్యాగాల తెలంగాణా ఏర్పాటుకు శ్రీకారంచుట్టిన తల్లి సోనియమ్మ అని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ మహిళా మణులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెడుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.