ఏజెన్సీ లోని గౌడ్ లను ఎస్టీలుగా గుర్తించాలి
ఏజెన్సీ లోని గౌడ్ లను ఎస్టీలుగా గుర్తించాలి
– గౌడ సంఘం రాష్ట్ర నేత యార్లగడ్డ భాస్కరరావు
దమ్మపేట , శోధన న్యూస్ : ఏజెన్సీ లో నివసిస్తున్న గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించాలని ఆ సంఘం సీనియర్ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు అన్నారు. గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌడ వనసమారాధన మండలపరిధిలోని చిన్నగొల్లగూడెం లోని పామాయిల్ తోటలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దమ్మపేట గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని , రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవ , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు .గౌడులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. గౌడ గీత కార్మికులకు సురక్షితమైన మోకు, సొసైటీల పునరుద్ధరణ, మాదక ద్రవ్య చట్టం క్రిందకి గీత కార్మికులను మినహాయించాలని ,గీత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్నారు. అంతకు ముందు మహిళలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు కుర్చీ ఆట , యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు . ఈ సందర్భంగా చిన్నారులు , యువకులు , మహిళలు వేసిన నృత్యాలు ఆహుతులను ఊర్రూతలూగించాయి . ఈ కార్యక్రమంలో దమ్మపేట గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు పానుగంటి చిట్టిబాబు , యార్లగడ్డ బాబు , శ్రీను , బంధం శ్రీను , సూరి , ఏసు , లక్ష్మణ్ , కాసాని నాగ ప్రసాద్ ,నాగయ్య , రేంజర్ భాస్కర్ ,చెన్నారావు ,వీరాస్వామి , గౌడ సంఘం సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.