వైరాలో మంత్రులకు ఘన స్వాగతం
వైరాలో మంత్రులకు ఘన స్వాగతం
-వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
వైరా, శోధన న్యూస్ : నియోజకవర్గ కేంద్రమైన వైరాలోనిమధిర క్రాస్ రోడ్ లోఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం నుండి భద్రాచలం వరకు విజయ యాత్రలో భాగంగా ముగ్గురు మంత్రులకు వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ ఆధ్వర్యంలో వైరా సెంటర్లో గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఖమ్మం పర్యటన ముగించుకొని భద్రాచలం పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లకు వైరా క్రాస్ రోడ్ లో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి వారిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎలాంటి ప్రసంగం చేయనప్పటికీ కొద్దిసేపు క్రాస్ రోడ్ లో ఆగిన మంత్రులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ నాయకులు బి రాజశేఖర్ సూరంపల్లి రామారావు కట్ల రంగారావు కట్ల సంతోష్ పలువురు పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు సానుభూతిపరులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.