అన్నదాన సేవా సమితికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రూ.లక్ష వితరణ
అన్నదాన సేవా సమితికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రూ.లక్ష వితరణ
ఖమ్మం, శోధన న్యూస్ : ఖమ్మం ముస్తఫానగర్ లో అయ్యప్ప మాల దారుల కోసం ఐదేళ్లుగా శ్రీదివ్య మణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 41రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తుంటారు. ఈ పుణ్య కార్యానికి ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర సోమవారం హాజరై లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అయ్యప్ప స్వాములతో కలిసి పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలాధారులకు స్వయంగా భోజనం వడ్డించారు.గత ఐదేళ్లుగా అయ్యప్ప స్వాములకు క్రమం తప్పకుండా అన్నప్రసాదం అందించడం గొప్ప విషయమని ఎంపీ వద్దిరాజు నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చిర్రా రవి స్వామి,పుట్ట మల్లికార్జున్,మాచర్ల నరేష్,నిదిగొండ శేఖర్,రవితేజ, చరణ్, గురుబ్రహ్మం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.