తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఆరు  గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం -ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ఆరు  గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం
-ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
 
అశ్వారావుపేట ,శోధన న్యూస్ : ప్రజలకు ఇచ్చిన వాగ్దానం లో భాగంగా వంద రోజులలోపే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గ కేంద్రం మైన అశ్వరావుపేట మండలానికి ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా తొలుత అశ్వరావుపేట పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడే కొద్దిసేపు పార్టీ నేతలతో మాట్లాడారు అనంతరం అక్కడనుండి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నేతలు ఆర్టీసీ అధికారులతో కలిసి జండా ఊపి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో కొద్దిసేపు ప్రయాణం చేసి పథకం యొక్క బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం ఐదు లక్షల నుండి పదిలక్షలకు పెంచడంతో ఈ పథకాన్ని జారే ప్రారంభించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జారే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ విధి అని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తామని దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేశామని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగానున్న తెలంగాణ తల్లి ,అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు జూపల్లి రమేష్, సర్పంచ్ అట్టం రమ్య, మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మెండ హరిబాబు, వేముల భారతి, సత్య వరపు తిరుమల, మొగళ్ళపు చెన్నకేశవరావు, జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి, నండ్రు రమేష్, జూపల్లి ప్రమోద్, వేముల ప్రతాప్, కర్నాటి శ్రీనివాసరావు, గుమ్మడి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, ఉప సర్పంచ్ కేదార్నాథ్, జల్లిపల్లి దేవరాజ్, బూసి పాండు, బత్తిన పార్థసారథి, ముబారక్ బాబా, కోఆప్షన్ సభ్యులు పాషా, దండ ఒత్తుల నరేష్, ఉదయ్, అగ్రికల్చర్ ఏడి అఫ్జల్ బేగం, పలువురు ఏ ఈ ఓ లు, సొసైటీ సీఈవో మానేపల్లి విజయబాబు, కమ్యూనిటీ హాస్పిటల్ వైద్యులు, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *