మాటూరు పేట ఆశ కార్యకర్తల సేవలు అభినందనీయం
ఆశ కార్యకర్తల సేవలు అభినందనీయం
మధిర, శోధన న్యూస్ : మాటూరు పేట ఆశ కార్యకర్తల సేవలు అభినందనీయమనీ పిహెచ్ సి విద్యాధికారి వీరబాబు తెలిపారు. మండల పరిధిలోని మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వీరబాబు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం అన్నారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ప్రతి గృహాన్ని సందర్శించి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, తద్వారా దోమల నిర్మూలన జరుగుతుందని, విష జ్వరాల నివారణకు కృషి చేయవచ్చునని ప్రజలకు వివరించాలన్నారు. 30 సంవత్సరాలు వయసు నిండిన వారిని గుర్తించి బీపీ, షుగర్ పరీక్షలు ప్రతినెలా చేయాలని తెలిపారు. ఈ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు అందజేయాలని, వారి జీవనశైలి, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కోరారు. గర్భిణీల గృహ సందర్శన చేసి సురక్షిత కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.