ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు..
ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు..
ఎర్రుపాలెం, శోధన న్యూస్ : వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యేయశస్వి రెడ్డిని ఎరుపాలెం మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం స్వగ్రామం లో కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని బని గండ్ల పాడు గ్రామాని కి చెందిన ఎన్నారై అనుమాండ్ల ఝాన్సీ ..మేనకోడలు గా బంధుత్వం కలిగి ఉండటంతో ఎరుపాలెం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వెళ్లినట్లు పార్టీ అధ్యక్షుడు వే మి రెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, అనుమో లు కృష్ణారావు, జంగా పుల్లారెడ్డి, తలపురెడ్డి నాగిరెడ్డి, శీలం అక్కిరెడ్డి, ఎర్రమల పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.