అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ధర్మశాస్త్ర ఆలయం…
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ధర్మశాస్త్ర ఆలయం…
చర్ల, శోధన న్యూస్ : మండల పరిధిలోని తాలిపేరు నదీ ఒడ్డున ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.బుధవారం మండల పరిధిలోని దండుపేట గ్రామం తాలిపేరు నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అడ్వకేట్ పెద్దాడ అనంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మండలంలోని అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు, భవాని మాలాధారణ చేసిన భవానీలు వందలాదిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బంక్ కిషోర్ గురుస్వామి,హిమగిరి గురుస్వామి,నరసయ్య గురుస్వామి, నాగరాజు గురుస్వామి,మాలాద్రి గురు స్వాములు మాట్లాడుతూ అన్ని దానంలలో కల్లా అన్నదానాన్ని మించింది లేదని పెద్దలు చెప్తుంటారని, అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని,అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తారని పురాణ గాథలు చెబుతున్నాయని అన్నారు.అన్నదానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరి ఉండకూడదని, ఆర్థిక స్తోమత లేని,శారీరక శక్తి లేని వారికి,వృద్ధులకు, అభాగ్యులకు, సాక్షాత్తు భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావనతో మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపు అవుతుందని అన్నారు.శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలోఅయ్యప్ప స్వాములకు, భవానీలకు బుధవారం అన్నదానం నిర్వహించిన అడ్వకేట్ పెద్దాడ అనంత్,ఆయన కుటుంబ సభ్యులను శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మల్లికార్జున స్వామి, మామిడి శ్యామ్ స్వామి,రాంబాబు స్వామి, రాము స్వామి,రమణమూర్తి స్వామి,సురేష్ స్వామి,శ్రీకర్ స్వామి,సంపత్ స్వామి,భాస్కర్ స్వామి,నవీన్ స్వామి, భరణి స్వామి,రత్తయ్య స్వామి, ప్రసాద్ స్వామి, నరేష్ స్వామి,పలువురు మణికంఠ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.