శరీర దానానికి అగ్రిమెంట్ చేసిన పద్మావతి
శరీర దానానికి అగ్రిమెంట్ చేసిన పద్మావతి
మధిర , శోధన న్యూస్ : పట్టణానికి చెందిన ఆర్.టి.సి కండక్టర్, ఎస్.డబ్ల్యు.ఎఫ్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి నామాల పద్మావతి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజికి తన శరీరాన్ని దానం చేశారు. బుధవారం నామాల పద్మావతి మరణాంతరం తన మొత్తం శరీరాన్ని మమత మెడికల్ కళాశాలకు దానం చేస్తున్నట్లు అగ్రిమెంట్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నామాల పద్మావతి మాట్లాడుతూ చనిపోయిన తర్వాత తన శరీరం నిరుపయోగంగా మట్టిలో కలిసిపోవడం కంటే వైద్య పరిశోధనలకు ఉపయోగపడటం మంచిదని అన్నారు. అందుకోసమే ఈ అగ్రిమెంట్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, జల్లా శ్రీనివాసరావు, డాక్టర్ ఉదయ్, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.