ఆదివాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ఎమ్మెల్యే రాగమయి
ఆదివాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా- ఎమ్మెల్యే రాగమయి
పెనుబల్లి , శోధన న్యూస్ : మండల పరిధిలోని కే డబ్ల్యూ చౌడవరంలో నివసిస్తున్న గుత్తి కోయిల కుటుంబాలను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కలుసుకొని వారి సమస్యల పరిష్కారం కొరకు బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు త్రాగునీరు కరెంటు రోడ్డు సదుపాయాలు కొరకు ముఖ్యమంత్రి జిల్లా మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సోమరాజు సీతారామారావు కేసర శ్రీనివాస్ రెడ్డి గూడూరు మాధవరెడ్డి మామిళ్ళ సత్యనారాయణ బెల్లంకొండ మధు ఆనందరావు వంగా దామోదర్ రావు చీకటి రామారావు నవజీవన్ పంది వెంకటేశ్వరరావు బొర్రా కోటేశ్వరరావు చెక్కిలాల మంగేశ్వరరావు డాక్టర్ కిరణ్ కుమార్ ఆదినారాయణ కర్రి కమలాకర్ గోగినేని రమేష్ మేకతోటి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.