ఎమ్మెల్యేను సన్మానించిన సిపిఐ నాయకులు
ఎమ్మెల్యేను సన్మానించిన సిపిఐ నాయకులు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : అశ్వరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన జారే ఆదినారాయణను మండలంలోని గండుగులపల్లి లో గల ఆయన స్వగృహంలో సిపిఐ నాయకులు బుధవారం కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ని కలసి ప్రజా సమస్యలను సిపిఐ పార్టీ దమ్మపేట మండల బృందం సభ్యులు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గం నుండి సిపిఐ పార్టీ బలపర్చిన జారే ఆదినారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజా సమస్యలను వివరించిన సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు .మూడో తారీఖున ఫలితాల్లో 29 వేల మెజార్టీతో గెలిచిన ఆదినారాయణ అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేసి వెంటనే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి తుఫాన్ కి నష్టపోయిన రైతులను ప్రజలను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వెంటనే నష్టపరిహారం భర్తీ చేయాలని అన్నారు .దమ్మపేట లారీ ఆఫీస్ ఎదురుగా మోకాల్లో తునీళ్లు నిలబడుతున్నాయని వాటిని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని నెమలిపేట .ప్రతి సంవత్సరం ముప్పు గురవుతుందని ఆ వంతేనను ఇంకా పెంచాలని సుమారు నమిలి పేటలో 60 కుటుంబాలు నివాసం ఉన్నాయని వారికి సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వ కాలనీ నిర్మించి ఇచ్చిందని శిథిలవస్థలో ఉన్నదని తక్షణం వాటి స్థానంలో కొత్తగా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. పేరంటాల చెరువు వద్దవంతేన సరిగా లేకపోవడం వలన ప్రతి సంవత్సరం కట్టలు తేగ్గుతున్నాయని రైతుల నష్టపోతున్నారని , శివాలయం నుంచి కళ్యాణ మండపం వరకు బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా ముత్యాలమ్మ గుడి దగ్గర వంతేన కూడా నిర్మించాలని అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుమారు 100 కుటుంబాలు ఇల్లు నిర్మించుకొని నివాస ఉంటున్నారని వారికి విద్య సౌకర్యం కల్పించాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు అనుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యలు పరిష్కారానికి రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపినారు .ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు తంగేళ్ల ముడీ శివకృష్ణ, మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాము, యువజన సంఘ నాయకులు రాపోలు శివన్నారాయణ, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు దొంగ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.