కార్యకర్తలారా దిగులు చెందకండి ..-పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా
కార్యకర్తలారా దిగులు చెందకండి …
ముందుంది అన్ని మన రోజులే….
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే మన బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది..
-పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోనీ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ…,.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9వ తారీకు 4000 పింఛన్ ఇస్తానని ఇవ్వలేదని, రైతుబంధు ఇస్తానని ఇంకా ఇవ్వలేదని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజుకి నాలుగు కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడిపించుట చాలా కష్టమని 100 రోజుల తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటే బిఆర్ఎస్ పార్టీ తరఫునుండి కార్యాచరణ రూపొందుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.