కారేపల్లి ఓటరు జాబితా ను ఎలాంటి లోపాలు లేకుండా రూపొందించాలి
ఓటరు జాబితా ను ఎలాంటి లోపాలు లేకుండా రూపొందించాలి
-కారేపల్లి తహశీల్దార్ సురేష్ కుమార్
కారేపల్లి, శోధన న్యూస్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తూ ఓటరు జాబితా ఎలాంటి లోపాలు లేకుండా రూపొందించాలని కారేపల్లి మండల తహసిల్దార్ వి. సురేష్ కుమార్ గురువారం బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు.మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఓటరు ధృవీకరణ,ఓటరు జాబితా తయారీ వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఓటర్ల నమోదుకు జనవరి1, 2024 ప్రామాణికంగా తీసుకుని ప్రతిఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఓటర్ లిస్టులో మరణించిన వారి పేర్లు తొలగించాలని, అలాగే రెండు పేర్లు ఉన్న వారిని కూడా గమనించి తొలగించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కె లక్ష్మి,ఆర్ఐ నరసింహారావు,జార్జి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.