తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సీతక్క, స్పీకర్లను కలిసిన వేముల భారతి దంపతులు

సీతక్క, స్పీకర్లను కలిసిన వేముల భారతి దంపతులు
అశ్వారావుపేట , శోధన న్యూస్ : రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వరావుపేట ఎంపీటీసీ తెలంగాణ రాష్ట్ర దిశా నాయకురాలు వేముల భారతి కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నాయకులు వేముల ప్రతాప్ దంపతులు బుధవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కీలకంగా వ్యవహరించనున్నారని తెలిపారు. సీతక్క నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై సీతక్క పోరాటానికి సమర శంఖం మోగించనున్నారని భారతి పేర్కొన్నారు. మహిళ శిశు సంక్షేమ మంత్రిగా మహిళల అభ్యున్నతకై నిరంతరం పోరాడతారని వారి సంక్షేమం కోసం పనిచేయడంలో సీతక్క అందవేసిన చేయని ఇందిరమ్మ రాజ్యంలో సీతక్క అధ్యాయనం చిర స్థాయి చిరస్థాయిగా నిలిచేలా పాలన ఉంటుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి ఎంపీటీసీ -వేముల భారతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక సాధారణ ఎంపీటీసీగా తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు ఈ ప్రస్థానాన్ని పొందడం సంతోషం గా ఉందని వీరి కార్యచరణ తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగకరమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *