మణుగూరు బీటిపిఎస్ లో ఘనంగా సెమీక్రిస్మస్ వేడుకలు
బీటిపిఎస్ ఘనంగా సెమీక్రిస్మస్ వేడుకలు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని చిక్కుడుగుంట ప్రాంతంలో గల మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో శుక్రవారం సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత క్రిస్మస్ కేక్ను ముఖ్య అతిథిగా హాజరైన బీటిపిఎస్ సీఈ బి బిచ్చన్న దంపతులు కట్ చేసి అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు క్రిస్ట్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈ బిచ్చన్న మాట్లాడుతూ… అన్ని మతాల సారం ఒకటేనన్నారు. భారతదేశం లౌకక దేశమన్నారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించడం భారతీయులందరి ఐక్యంగా ఏకత్రాటిపై ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏస్ఈ ఏడి ఎం పార్వతి, డివైసిసి డి శ్రీనివాసరావు, సివిల్-1 ఎస్ఈ డివి రమణమూర్తి, సివిల్2 ఎస్ఈ రాంప్రసాద్, స్టేజి2 ఎస్ఈ రమేష్ స్టేజి1 ఎస్ఈ రమేష్బాబు, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, డిఇలు, ఏడిఏలు, బిహెచ్ఐఎల్ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.