రైతుల నష్టపరిహారం పై చర్చ
రైతుల నష్టపరిహారం పై చర్చ
సత్తుపల్లి , శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు ను వారి ఛాంబర్ లో మంత్రి బాధ్యత లు స్వికరించిన సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసారు .అనంతరం ఖమ్మం ,నల్గొండ జిల్లాల ఇరిగేషన్ రివ్యూ సమావేశం హైదరాబాద్ సెక్రటేరియట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు లతోపాటు రెండు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా యాతాలకుంట గ్రామ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతుల పరిహారం పెండింగ్ సమస్య పై ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడారు. వీలైనంత త్వరగా సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.