తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

 కార్మిక సమస్యల పరిష్కారం ఏఐటియుసితొనే సాధ్యం-  ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

 కార్మిక సమస్యల పరిష్కారం ఏఐటియుసితొనే సాధ్యం 

-ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

ఇల్లందు, శోధన న్యూస్ :  కార్మిక సమస్యల పరిష్కారం ఏఐటియుసితొనే సాధ్యమని ఆ యూనియన్  ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో ఆదివారం ఇల్లందు ఏరియాలోని జేకేఓసిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఫిట్ సమావేశము నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హాజరై  మాట్లాడుతూ రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో, నిరంతరం కార్మికుల హక్కుల రక్షణ సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు పోరాడే ఏఐటీయూసీ యూనియన్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్మికులను కోరడమైనది.సింగరేణిలో మొన్నటిదాకా బిఆర్ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికేఎస్ యొక్కమితిమీరిన రాజకీయ జోక్యం వలన సంస్థ భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందని అన్నారు.. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా సంస్థలో రాజకీయ జోక్యంతో సంస్థను ఆర్ధికంగా దోపిడీ చేయాలనీ కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐన్టీయుసి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు కార్మిక సమస్యలు ఏ మాత్రం పట్టించుకోని కొన్ని యూనియన్లు కార్మికులకు మాయమాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని వారి మాటలు నమ్మి మల్లి మోసపోవద్దని అన్నారు ఎఐటియుసి కార్మికుల సొంత ఇంటి పథకం కొసం పొరాటం చేస్తుందని సొంత ఇంటి కల నేరవేస్తామని అన్నారు. గతంలో ఎఐటియుసి గుర్తింపు సంఘం గా ఉన్నప్పుడు భూపాలపల్లి, శ్రీరాంపూర్, మంచిర్యాల ఏరియా లొ కార్మికుల కు రెండు వందల జాగా ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసామని గుర్తు చేశారు.   పది సంవత్సరాలు అధికారంలొ ప్రభుత్వం ఉండి తొమ్మిది సంవత్సరాలు టిబిజికేఎస్ గుర్తింపు సంఘంగా ఉండి ఏమి చేశారు అని ప్రశ్నించారు. ఎఐటియుసి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం కార్మికుడి జీతంలొ అలవెన్స్ ల పైన పడుతున్న ఐటీని కంపెనీ ద్వారా రీ ఎంబర్స్ మెంట్ చె ల్లించే విధంగా  కృషి  చేస్తామని హమీ ఇచ్చారు. ఇల్లందు జేకేఓసి సమస్యలు పరిష్కరిస్తామని జెకెఓసి ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని  అన్నారు.ప్రమోషన్లు కల్పించే దాంట్లో అర్హత ఉన్న చదువుకున్న జనరల్ మజ్దూర్ లపక్షాణా పొరాడుతామని అన్నారు.   ఎల్లేవేళలా కార్మికుల పక్షాన ఉంటూ,,కార్మికుల సమస్యలు పరిష్కరిష్కారానికి కృషి చేస్తున్న  ఏఐటీయూసీ యూనియన్ని 27 వ తేదీన జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో నక్షత్రం గుర్తుపై ఓటు వేసి కార్మికులు భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కార్మికులను కోరారు. ఈ  ఫిట్  సమావేశంలొ బ్రాంచి కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, బ్రాంచి సహయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్, సిపిఐ పట్టణ కార్యదర్శి బందం నాగయ్య, టిజెఎస్ జిల్లా ఉపాద్యక్షులు గుగులోత్ కృష్ణ,మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య, బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శులు కొరిమి సుందర్, సాలీబ్ సాహెబ్, పిట్ సహయ కార్యదర్శి బొల్లేద్దుల శ్రీనివాస్, జక్కుల శ్రీనివాస్, బానోత్ బాలాజీ,దాట్ల వేంకటేశ్వర్లు, లక్ష్మణ్ రావు‌,తిరుమల రావు, మంచాల వేంకటేశ్వర్లు, చాట్ల గణపతి, నారాయణ, అమ్మ ఆంజనేయులు,పైడిరాజు, ప్రసాద్ రెడ్డి,జగదీష్, సురేష్ బాబు, షేక్ వళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *