ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
మధిర, శోధన న్యూస్ : మండలంలోని సిరిపురం గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు సంఘ కాపరి పాస్టర్ మేరుగు బెంజిమెన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ దైవ ప్రసంగీకులు పల్నాడు జిల్లా మాచర్ల నుండి బ్రదర్ కిరణ్ కుమార్ విచ్చేసి సంఘస్తులకు గ్రామ ప్రజలకు దేవుని గూర్చిన వాక్యోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో ప్రయాణించాలన్నారు. ఏసుక్రీస్తు బోధనలో ప్రపంచానికే ఆదర్శనీయమని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఈర్ష ద్వేషాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యువకులు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘస్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.