ఇండ్లలో చోరీ
ఇండ్లలో చోరీ
-రూ 25 వేల నగదు,.. 18 తులాల బంగారం అపహరణ
సత్తుపల్లి, శోధన న్యూస్ : రెండు ఇండ్లలో చోరీ చేసిన సంఘటన మంగళవారం రాత్రి బేతుపల్లి గ్రామంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని బేతుపల్లి గ్రామానికి చెందిన కోరం లక్ష్మణరావు అనే వ్యక్తి బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ గా నిధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 08:30 గంటలకు ఫంక్షన్ నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి సత్తుపల్లి వచ్చి ఫంక్షన్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లి చూడగా కిచెన్లో ఉన్న కిటికీ నుండి రాడ్ తో కిచెన్ డోర్లు ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు, బీరువా తలుపులు తెరుచుకొని వస్తువులన్ని చిందర వందరగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. నెక్లెస్, బ్రాస్లెట్, ఉంగరాలు, మాటీలు, చెవులు బుట్టలు చోరీకి గురైనట్లు లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కుశ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.