తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

  విప్లవ కార్మిక సంఘాల కూటమికి ఓటు వేసి గెలిపించండి-ఇఫ్టూ  జాతీయ అధ్యక్షులు సాధినేని

  విప్లవ కార్మిక సంఘాల కూటమికి ఓటు వేసి గెలిపించండి 

– హక్కుల కోసం యాజమాన్యాన్ని ప్రభుత్వాలను నిలదీస్తాం

-ఇఫ్టూ  జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వర రావు

మణుగూరు,  శోధన న్యూస్ : 

కోడ్ ఆఫ్ డిసిప్లైన్ పేరుతో కార్మిక సంఘాలకు గొంతుని కార్మిక హక్కులని కాలరాసే వ్యవహారాలని ఎండగట్టాలని, సింగరేణి కోసం నిరంతరం పోరాడే విప్లవ కార్మిక సంఘాలైన చక్రంలో సుత్తి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఇఫ్టూ ) జాతీయ అధ్యక్షులు  సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు, ఈనెల 27వ తేదీ జరుగునున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మణుగూరులోని పీకే ఓసి 2, ఏరియా వర్క్ షాప్, సింగరేణి ఏరియా హాస్పిటల్ లో జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర కార్యదర్శి  నాసర్ పాషా,మరికంటి సిద్దయ్య ల అధ్యక్షతన జరిగిన ప్రచార పిట్ మీటింగ్ లలో  సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశానికే వెలుగునిచ్చే ఈ సింగరేణి చీకటిలోకినట్టేస్తున్న ఈ పాలకవర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలన్నారు. వందల కోట్ల లాభంలో ఉన్న సింగరేణి ఎందుకు నేడు కార్మిక వర్గాన్ని ఎందుకు ఆదుకోలేకపోతుందో పర్మినెంట్ ఉద్యోగాలను ఇవ్వలేకపోతుందో కార్మికులకు కనీస సౌకర్యాలు నెలకొల్ప లేక పోతుందో చెప్పాలని అ న్నారు. విద్య, వైద్యం కు లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తున్నా ఈ సింగరేణి మేనేజ్మెంట్ ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ సింగరేణి స్కూల్స్ ని మూసివేసే దిశలో ప్రోత్సహిస్తుందన్నారు. సర్ఫేస్ మైనర్ లను తీసుకువచ్చి కార్మికులను తగ్గించుకుంటూ వారసత్వ ఉద్యోగాలని తగ్గించుకుంటూ వస్తుందన్నారు. సింగరేణి సంస్థ నిలబడాలంటే వారసత్వ ఉద్యోగాలు రావాలంటే మన హక్కులు కాలరాయకొండ ఉండాలంటే ప్రశ్నించే గొంతుకలు బతకాలంటే విప్లవ కార్మిక సంఘాలు ఉండాలని ఆయన  కార్మికులకు తెలియజేశారు.  సింగరేణి పరిరక్షణ కోసంబొగ్గు బావుల ప్రైవేటి కరుణ,కార్పొరేటికరుణ కు వ్యతిరేకంగా,ఉద్యోగ భద్రత,వారసత్వ ఉద్యోగాల నియామకం కొరకు,కార్మికుల ఆదాయపన్ను రద్దుకై,ఓపెన్ కాస్ట్ ల రద్దుకై,నూతన అండర్ గ్రౌండ్ మైన్స్ ఏర్పాటుకై,పని భారం తగ్గింపు,రక్షణ చర్యలు అమలుకై,సింగరేణిలో వస్తున్న నిరంకుశ కోడ్ ఆఫ్ డిసిప్లేన్ కొరకు,కార్మిక సంఘాల హక్కుల కొరకు,అవినీతి పైరవీలకు వ్యతిరేకంగా,ప్రశ్నించే గొంతుకులను కాపాడుకోవాలని అందులో భాగంగానే ఐ ఎఫ్ టి యు-ఏ ఐ ఎఫ్ టి యు-ఐ ఎఫ్ టి యు పోటీ చేస్తున్న చక్రంలో సుత్తి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సింగరేణి రక్షించుకుందామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్య, జి ఎల్ బి కేస్ రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా, సిద్దయ్య,టి జి ఎల్ బి కేస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరావు, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి అనురాధ,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎండి రాశుద్దిన్,ఏరియా నాయకులు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *