నామా ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ.
నామా ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ.
జూలూరుపాడు, శోధన న్యూస్ : నామా ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలం లోని ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు.బుధవారం మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు చేతులు మీదుగా కాకర్ల,వెంగన్నపాలెం, కరివారిగూడెం, పాపకొల్లు, అన్నార్పడు ఆటో స్టాండ్ లకు చెందిన డ్రైవర్లకు ఖాకీ చొక్కలను అందచేశారు.ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ అందించటం ప్రశంసనీయం అని అన్నారు.నామా ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ మంచి కార్యక్రమం అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో తన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ను స్థాపించి సేవలందించడం అభినందనీయమని శ్రీనివాసరావు అన్నారు.నామా ట్రస్ట్ ద్వారా ఆటో డ్రైవర్లకు నాణ్యమైన ఖాకీ చొక్కాలను అందిస్తున్నారని తెలిపారు.పార్లమెంట్ సభ్యులుగా నామా నాగేశ్వరరావు భవిష్యత్ లో మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ విధి నిర్వహణలో ఖాకీ చొక్కాలు ధరించి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రయాణీకులతో క్రమశిక్షణగా ఉండాలని ఆటో డ్రైవర్లను సిఐ శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, జెట్పీటీసీ భూక్య కళావతి, మాజీ ఎంపిపి మూడ్ చిట్టిబాబు,నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, పులదాసు కృష్ణమూర్తి, యదపల్లి వీరభద్రం, చపల మడుగు రామ్మూర్తి,వాంకుడోత్ వెంకన్న,ఇల్లంగి తిరుపతి, ఆటో యూనియన్ అధ్యక్షులు బాణోత్ నాగేశ్వరరావు , కార్యదర్శి వీరభద్రం, కాకర్ల ఆటో స్టాండ్ అధ్యక్షులు కొండె రమేష్,గుణ్ణం వెంకటే శ్వర్లు,కంపసాటి గోపాల రావు,సాయిన్ని వెంకట నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు.