ఖమ్మంతెలంగాణ

రక్తపింజర్ కాటుకు రైతు మృతి

రక్తపింజర్ కాటుకు  రైతు మృతి

సత్తుపల్లి, శోధన న్యూస్ : పొలంలో పనిచేస్తున్న పేదరైతుని రక్తపింజర్ పాము కాటు వేయడంతో వారం రోజులు పాటు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, వైద్యం అందుతున్నప్పటికీ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పటాన్ నాగుల మీరా( 45) తనకున్న అరెకరం భూమిలో చెరుకు పంటను సాగు చేస్తున్నారు ఈనెల 13న చెరుకు తోటలో ఉన్న చెత్తను కాల్చివేసే సమయంలో రక్త పింజర పాము కాటేసింది అతనిని వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు .తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సత్తుపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లి పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖమ్మం లో చికిత్స పొందుతూ నాగుల మీద బుధవారం మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు అకాల మరణానికి గురి కావడంతో ఆ కుటుంబం జీవన పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *