తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంగన్వాడీ కేంద్రాలకు ఎల్ఈడి టీవీలు అందజేత

అంగన్వాడీ కేంద్రాలకు ఎల్ఈడి టీవీలు అందజేత

చండ్రుగొండ, శోధన న్యూస్ : అంగన్వాడీ కేంద్రాలకు ఎల్ఈడి టీవీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారిని వేల్పుల విజేత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు ఆటపాటలతో పాటు విద్యా వైజ్ఞానిక సంబంధమైన విషయాలను తెలుసుకుంటూ చదువులో రాణించాలని అంగన్వాడీ కేంద్రాలకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసి సాక్ష్యం అంగన్వాడి కేంద్రాలను గుర్తించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండువేల అంగన్వాడి కేంద్రాల్లో 350 సాక్ష్యం అంగన్వాడీలుగా గుర్తించి ఎల్ఈడి టీవీలను అందజేయడం జరిగిందన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రధానంగా చిన్నారుల పట్ల దయతోటి ఉంటూ మర్యాదపూర్వకంగా స్నేహ భావంతో మెలుగుతూ విద్యను అందించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు ఆకుకూర తోటలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి సిడిపిఓ నిర్మల జ్యోతి, సూపర్వైజర్లు రాణి, శకుంతల, లక్ష్మి, సుజాత ,జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *