ఘనంగా గణితశాస్త్ర దినోత్సవం
ఘనంగా గణితశాస్త్ర దినోత్సవం
మణుగూరు, శోధన న్యూస్ : మున్సిపాలిటిలోని పైలట్ కాలనీలో గల ఎక్స్టెంట్ హైస్కూల్లో శుక్రవారం గణితశాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్టెంట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎండి ఖాదర్ మాట్లాడుతూ.. గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామునుజన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 22న జాతీయ గణితశాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. శ్రీనివాస రామానుజన్ మానవుని నిత్య జీవితంలో గణితశాస్త్ర ప్రాధాన్యతను వివరించడమే కాకుండా గణితంలో చాలా రకాల ఫార్ములాలను అభివృద్ధి చేశారన్నారు. విద్యార్ధులు గణితాన్ని బాగా అర్ధం చేసుకుని నిరంతరం సాధన చేయాలన్నారు. అనంతరం గణితశాస్త్ర ఉపాధ్యాయులు ఏ భద్రంబాబు, టి రాజారత్నం, జయచిత్ర, కె విజయ్, శ్రీలతలను శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం గణిత ప్రాధాన్యతను తెలిపే పాటలకు చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్టెంట్ విద్యాసంస్థల డైరెక్టర్స్ యూసఫ్ షరీఫ్, యాకుల్షరీఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విదార్థులు పాల్గొన్నారు.
-శ్రీచైతన్య పాఠశాలలో:
మండలంలోని గుట్టమల్లారంలో గల శ్రీచైతన్య పాఠశాలలో శుక్రవారం గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి, గణితశాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రామనుజన్ చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపల్ సాయికృష్ణ ప్రసాద్ పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం గణిత ఉపాధ్యాయులు ఎం నరేష్, ఎన్ నరేష్, ఎల్ నరేష్, స్వప్న, రమ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు గణిత ప్రాధాన్యత పై రంగోళి పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.