తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

క్రిస్మస్ వేడుకలో  పాల్గొన్న జిల్లా కలెక్టర్

క్రిస్మస్ వేడుకలో  పాల్గొన్న జిల్లా కలెక్టర్

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  శాంతి సమాధానం ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటమే క్రిస్మస్ అని ఆమె అన్నారు.  అనంతరం ఆమె కేక్ కట్ చేసి తెలంగాణ ప్రభుత్వం అందించే కానుకలను క్రైస్తవలకు అందజేశారు ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాఘవరెడ్డి, వైస్ ఎంపిపి కెవి రావు, సర్పంచులు బచ్చల భారతి, తాటి సావిత్రి, ఉపసర్పంచులు పుచ్చకాయల శంకర్, తరుణ్ రెడ్డి, ఆర్ఐలు శ్రీనివాస్, లీలావతి, ఎంపీటీసీ జి కోటేశ్వర రావు,  మండల పాస్టర్లు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *