ఖమ్మంతెలంగాణ

ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాలు అందించాలి -ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాలు అందించాలి

-ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

మధిర, శోధన న్యూస్: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే సంక్షేమ పథకాలను త్వరగా అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కోరారు. గురువారం మండల పరిధిలోని నక్కలగరుబు (బుచ్చిరెడ్డిపాలెం) సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన ఆరు గ్యారంటీల దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు తక్షణమే ఆ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పేద ప్రజలు పనులు మానుకొని దరఖాస్తులు అందించేందుకు ఎన్నో ఆశలతో అధికారుల వద్దకు వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *