ప్రజా సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలి -అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే
ప్రజా సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలి
-అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే
దమ్మపేట ,శోధన న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గారంటీల పథకం అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు .ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మండలంలో శుక్రవారం పలు గ్రామాలలో సభలు జరగా లింగాలపల్లి లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా ఆరు గారెంటీలలో రెండు గారెంటీ లను అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోకి అమలు చేశామని మిగతా గ్యారెంటీలను అతి త్వరలోనే అమలు చేయనున్నామని దీనిలో భాగంగానే ప్రజల వద్ద నుండి దరఖాస్తులను సేకరిస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముజాహిద్, ఎంపీడీవో నాగేశ్వరరావు, మండల లోని పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.