ప్రజా పాలన కార్యక్రమాన్ని సందర్శించిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు
ప్రజా పాలన కార్యక్రమాన్ని సందర్శించిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు
యాదాద్రి భువనగిరి, శోధన న్యూస్ : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ప్రజాపాలన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతు మంగళవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతు కె, జెండిగా, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న ప్రజలను వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు జిల్లా కలెక్టర్ తో చౌటుప్పల పట్టణంలో ఆధార్ కేంద్రం తక్షణమే ఏర్పాటు చేయాలనీ కోరడంతో జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు ఆధార్ సెంటర్ ఏర్పాటు కావాల్సిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో జగన్నాథం రావు,మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్స్ దండ హిమబిందు అరుణ్ కుమార్, పొలోజు శ్రీధర్ బాబు, బొడిగే అరుణ బాలకృష్ణ, నాయకులు ముగుదాల రమేష్, గుర్రం పాండు రంగం, గోషిక వినయ్, ఎండి వసీం, పొలోజు శ్రీనివాస్, ఎరుకల సాయి కుమార్, చాంద్ పాషా, చింతల మహేందర్ పాల్గొన్నారు