నీటి సంపులో పడి చిన్నారి మృతి
నీటి సంపులో పడి చిన్నారి మృతి
అశ్వాపురం, శోధన న్యూస్ : నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో ఇంటి సమీపంలో ఉన్న నీటి సంపులో పడి చిన్నారి గ్రీష్మిత మృతి చెందింది. ఆడుకోవడానికి వెళ్లిందని అనుకున్న బాలిక ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో పడి ఎవరు గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు గమనించి బయటికి తీసేలోపే చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.